గాంధీజీని మరోసారి చంపేశారు... ఈ పైసాచిక ఆనందం ఏంటో

కొందరు చేసే పనులు అత్యంత విచిత్రంగా అనిపిస్తాయి.వారికేమైనా పిచ్చి లేచిందా అనిపిస్తుంది.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఇండియన్‌ కూడా జాతిపిత మహాత్మాగాంధీని అభిమానిస్తారు, అభిమానించాలి.కాని కొందరు మాత్రం మహాత్మాగాంధీని విమర్శించడం ఫ్యాషన్‌ అనుకుంటారు.

గాంధీజీపై కొందరు అసత్య వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ఉంటారు.ప్రతి సారి హిందూ మహాసభల్లో గాంధీజీని అవమానించడం, ఆయనపై విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి హిందూ మహాసభల ప్రతినిధులు మరో అడుగు ముందుకు వేసి గాంధీజీని మరీ దారుణంగా చంపినట్లుగా చిత్రీకరించారు.

Advertisement

గాంధీజీ చిత్ర పటంను పెట్టుకుని ఏకంగా గన్‌తో పేల్చినట్లుగా ఫొటోలకు ఫోజ్‌లు ఇచ్చారు.ఆ ఫోజ్‌లు మాత్రమే కాకుండా గాంధీజీని కాల్చితే ఆయనకు రక్తం వచ్చినట్లుగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు.మరీ ఇంత పైసాచిక ఆనందం ఏంటో.

గాడ్సే ఈజ్‌ గ్రేట్‌ అంటూ వీరు నినాధాలు చేస్తూ వస్తున్నారు.ప్రతి హిందూ మహాసభల సమయంలో ఇలాంటి సంఘటనలు కామన్‌ కాని, ఈసారి సీన్‌ మరింత సీన్‌ చేశారు.

దేశ వ్యాప్తంగా వీరపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.

-->గాంధీ హిందూ మతంకు చెందిన వాడు కాదనేది వారి అభిప్రాయం.అసలైన హిందువు గాడ్సే అనేది వారు బలంగా నమ్ముతున్న విషయం.గాంధీజీ వర్ధంతి రోజు ఇలా ఘాతుకానికి ఒడి గట్టడం జరిగింది.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

గాడ్సే చిత్రపటంను ఊరేగిస్తూ గాంధీజీని చంపినట్లుగా చూపిస్తూ ప్రదర్శణలు చేస్తున్న నేపథ్యంలో వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధిస్తేనే మరొకరు ఇలా ప్రవర్తించరు అంటూ జనాలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు