ప్రకృతి సేద్యం ద్వారా మునగను సాగు చేస్తేనే అధిక దిగుబడి..!

వ్యవసాయ రంగం( Agriculture )లో రైతులు అధికంగా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, జొన్న లాంటి పంటలను సాగు చేస్తున్నారు.

ఒకే రకం పంటలు వేయడం వల్ల వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

అలా కాకుండా సాగు చేసే విధానం, కొత్తరకం పంటలను సాగు చేస్తేనే పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించి అధిక లాభాలు పొందుతున్నారు.

మునగ సాగు( Drumstick Cultivation )లో ప్రకృతి సేద్యం ద్వారా అధిక దిగుబడి పొంది మంచి లాభాలు అర్పించవచ్చు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 500 మొక్కలను పెంచవచ్చు.ఒక ఎకరాకు దాదాపుగా రూ.35 వేల వరకు పెట్టుబడి అవుతోంది.ఇక ఆదాయం విషయానికి వస్తే ఒక్కో మునగ మొక్క నుండి 600 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

మార్చి, ఏప్రిల్, మే నెలలో పంట చేతికి వస్తుంది.ఈ కాలంలోనే పంటకు మంచి డిమాండ్ ధర ఉండడంతో నష్టం అనేది లేకుండా లాభాలు పొందవచ్చు.ఒక ఎకరం పంటను సాగు చేస్తే లక్ష రూపాయలకు పైగా ఆదాయం పొందవచ్చు.

Advertisement

అధిక వర్షాలు పడితే మునగ పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకుతాయి.ఈ తెగులను తొలి దశలోనే గుర్తించి అరికట్టాలి.

ట్రైకోడెర్మా విరిడి( Trichoderma virid ) రెండు కిలోలు, 90 కిలోల పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని ఐదు కిలోల చొప్పున వేయాలి.మునగకు తీవ్ర నష్టం కలిగించే తెగులు పూత దశలో ఆశించి పిందె దశ వచ్చేవరకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

దీంతో కాయలు వంకర్లు తిరుగుతాయి.కాబట్టి తొలి దశలోనే నివారణ చర్యలు తీసుకోవాలి.

పంట మార్పిడి చేస్తేనే నేల సారాన్ని కోల్పోకుండా ఉండడంతో పాటు వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు పంటను ఆశించే అవకాశం ఉండదు.

Advertisement

తాజా వార్తలు