ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.గత కొన్ని రోజులుగా మహిళా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇవాళ నూతన పార్లమెంట్ దగ్గరకు వెళ్లేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు రెజ్లర్లు, రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ఢిల్లీకి వస్తున్నారు.

అయితే రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో యూపీ, హర్యానా సరిహద్దుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.బయట నుంచి ఢిల్లీలోకి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు