తమిళనాడు హోసూరులో హైటెన్షన్..!

తమిళనాడు రాష్ట్రం క్రిష్టగిరి జిల్లా హోసూరులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.జల్లికట్టు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని యువకులు వీరంగం సృష్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై నిరసనకు దిగన యువకులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో పోలీసులకు గాయాలు కావడంతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

దీంతో గాయలపాలైన పోలీసులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.కాగా ఆందోళనకారుల దాడిలో పోలీస్ వెహికిల్స్ తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

మరోవైపు హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ నేపథ్యంలో పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు హోసూరుకు అదనపు పోలీసు బలగాలను రప్పించారు అధికారులు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...