జగన్ పై దాడి : ఏపీ ప్రభుత్వంపై కోర్టు సీరియస్ !

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కత్తి దాడి వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఆ దాడి జరిగిన తరువాత అనేక మలుపుల మధ్య ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

ప్రభుత్వ తీరుపైనా గతంలోనూ.కోర్టు ప్రభుత్వం మీద మండిపడింది.

జగన్ పై దాడి కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు లో ఈరోజు వాదనలు జరిగాయి.సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు.

ఎన్‌ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్ట్ లేదా, ఎయిర్ క్రాఫ్ట్ లో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందన్నారు.అన్ లా ఫుల్ అగనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఎవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3(ఏ)కింద కేసు నమోదు చేయాల్సి ఉందని జగన్ తరపు న్యాయవాది వాదించారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ఏపీ సర్కారును ప్రశ్నించింది.కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ఎందుకు అప్పగించలేదని పశ్నించింది.

ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Advertisement