కొండా సురేఖ దూకుడుపై  హై కమాండ్ ఆగ్రహం ? చర్యలు తప్పవా ? 

తెలంగాణ మంత్రి కొండ సురేఖ ( Konda Surekha )దూకుడు వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.

సురేఖ దూకుడుతో కాంగ్రెస్ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతోపాటు,  ప్రజలలోను చులకన అవుతున్నామనే భావానికి ఆ పార్టీ అధిష్ఠానం వచ్చింది.

  ముఖ్యంగా సురేఖ వ్యవహారం లో సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇరుకున పెట్టే క్రమంలో ఆయనపై విమర్శలు చేస్తూ  సినీనటి సమంత ,నాగార్జున , నాగ చైతన్య( Samantha, Nagarjuna, Naga Chaitanya ) పేర్లను ప్రస్తావించడంతో చిక్కుల్లో పడ్డారు.

  ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం సీరియస్ అయింది.అయితే జరిగిన నష్టాన్ని గుర్తించి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పించినా, ఈ విషయంలో నాగార్జున మాత్రం వెనక్కి తగ్గలేదు.

High Command Angered By Konda Surekhas Aggression Are The Actions Wrong, Kond

కొండా సురేఖ పై కోర్టు లో పరువు నష్టం దావా దాఖలు చేయడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది.అంతేకాకుండా ఇదే విషయంపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ  దృష్టికి అక్కినేని అమల తీసుకువెళ్లడం, ఆమెపై   చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడంతో , తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రియాంక గాంధీ అమలకు హామీ ఇచ్చారట.ఒకవైపు మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న సమయంలోనే , మరో వివాదంలో కొండా సురేఖ చిక్కుకున్నారు.

Advertisement
High Command Angered By Konda Surekha's Aggression Are The Actions Wrong, Kond

సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి( Prakash Reddy ) వర్గీయులతో సురేఖ వర్గానికి మధ్య విభేదాలు తలెత్తయి.  ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి.

దీంతో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారింది.

High Command Angered By Konda Surekhas Aggression Are The Actions Wrong, Kond

 ఫోటోతో మొదలైన వివాదం కాస్త తర్వాత ఫ్లెక్సీ చించివేత వరకు వెళ్లాయి.  ఆ తరువాత ధర్నాలు,  దాడులు,  అరెస్టుల వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో , నేరుగా కొండ సురేఖ రంగంలోకి దిగారు.  మంత్రి హోదాలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి సిఐ సీట్లోనే కూర్చోవడం , తమ వర్గీలను విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ చెప్పడం  వివాదాస్పదంగా మారింది.

సీఐ సీట్లో  సురేఖ కూర్చోవడం,  తన వర్గీయులను విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ ఆదేశించడంపై , విపక్షాలు కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకున్నాయి.ఒక వైపు సమంత వ్యవహారం, మరోవైపు పోలీస్ స్టేషన్ వ్యవహారంతో వివాదాస్పదం గా మారిన కొండా సురేఖ పై చర్యలకు కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు