ప్రేమించిన అమ్మాయి ల కోసం జైలు పాలైన హీరోలు ఎవరో తెలుసా ? ?

ప్రస్తుతం యావత్ సినిమా ఇండస్ట్రీలో హీరో దర్శన్( Hero Darshan ) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ఇతడి గురించి తెలుగు వారందరికీ కూడా సుపరిచితమే.

హీరోగా అందరికీ పరిచయమైతే బాగానే ఉంటుంది కానీ హత్య చేసి అందరికీ తన పేరు తెలుసుకునేలా చేశాడు దర్శన్.అదేంటి ఒక హీరో హత్య చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? రీల్ లైఫ్ లో చేసే పనులు రియల్ లైఫ్ లో చేస్తే ఊరుకుంటారా అలాంటి పని ఒకటి చేసి జైలు పాలు అయ్యాడు హీరో దర్శన్.అయితే ఈ జైలు పాలు అవడానికి వెనుక చాలా పెద్ద కథే ఉంది.

హీరో దర్శన్ మాత్రమే కాదు ఇలా అనేకమంది తప్పులు చేసి జైలు పాలైన హీరోలు ఉన్నారు మరి వారెవరు ఏ సంఘటన వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ముందుగా దర్శన్ విషయానికొస్తే పెళ్లయి భార్య కొడుకు ఉన్నప్పటికీ పవిత్ర గౌడ( Pavithra Gowda ) అనే ఒక కన్నడ నటితో పదేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తూ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నా.అది తట్టుకోలేని ఆయన అభిమాని పవిత్రతో అసభ్యంగా ప్రవర్తించాడట.

దాంతో మనుషులను పెట్టి సుఫారీ ఇచ్చి మరి హత్య చేయించాడు దర్శన్.దాంతో కటకటాల పాలవ్వాల్సి వచ్చింది.

Advertisement

ఇక దర్శన తరహాలోనే అమ్మాయి కోసం జైలు పాలైన మరో హీరో మలయాళ ఇండస్ట్రీలో ఉన్నాడు.అతడు మరెవరో కాదు హీరో దిలీప్.( Hero Dileep )

దిలీప్ కి భార్య మంజు వారియర్ ఉండగానే కావ్య మాధవన్ తో ( Kavya Madhavan ) ప్రేమలో పడి చివరికి విడాకులు ఇచ్చి కావ్యను వివాహం చేసుకున్నాడు.కావ్యకు మరియు హీరోయిన్ భావనకు( Bhavana ) సరిపోకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయి కావ్యకు మద్దతు ఇవ్వడం కోసం ఏకంగా భావనపై రేప్ అటెంప్ట్ చేయించాడు హీరో దిలీప్.

దాంతో చాలా రోజులపాటు జైల్లో గడపాల్సిన వచ్చింది.ఇలా ప్రేమించిన వారి కోసం హత్యలు చేయడం లేదా అమ్మాయిలను వేధించడం వంటివి చేయడం నిజానికి సల్మాన్ ఖాన్ తో మొదలయ్యాయి.ఐశ్వర్యారాయ్ ని ఎంతగానో ప్రేమించిన సల్మాన్ ఆమె వివేక్ ఓబరాయ్ తో క్లోజ్ గా ఉంటుందని కారణంతో అతనిపై దాడి చేశాడు సల్మాన్.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు