ఇటీవల కాలంలో కొన్ని సినిమాలను గమనిస్తే ఆ పాత్రను వారు కాకుండా ఎవరు పోషించినా కూడా సినిమా విజయవంతం అయ్యేది అనిపిస్తుంది.
కేవలం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలను మాత్రమే గమనించి ఈ ఆర్టికల్ రాయడం జరుగుతుంది.
ఇలా కొంతమంది సదరు పాత్రలకు న్యాయం చేయలేదు.దానివల్ల వారి ప్రభావం ఆ సినిమాపై పడుతుంది.
అలా ఆ పాత్ర సినిమాకి ఉపయోగపడుతూ వారి కెరియర్ కి కూడా ఉపయోగపడదు.టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.
కానీ ఇటీవల కాలంలో గమనిస్తే క్యాస్టింగ్ విషయంలో డైరెక్టర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయినా కూడా భారీగానే పొరపాట్లు జరుగుతున్నాయి.
మరి ఆ సినిమాలు ఏంటి ? ఆ పాత్రలు ఎవరు చేశారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన రాదే శ్యామ్ సినిమా ( Radhe Shyam )దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకున్న విషయం మన అందరికి తెలుసు.ఇందులో ఎవరు పాత్రలు చేసినా పెద్దగా ఉపయోగమేమీ లేదు కానీ ప్రభాస్ ఫ్రెండ్ గా నటిచ్చిన బాలీవుడ్ యాక్టర్ అస్సలు ఆ పాత్రకు సెట్ కాలేదు.ఆ పాత్రలో ఎవరైనా తెలుగు నటుడు నటించి ఉండి ఉంటే బాగుండేది.
విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటించిన లైగర్ సినిమా( Liger Movie ) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ సినిమా పరాజయానికి హీరోయిన్ అనన్య కారణం అంటూ మొత్తుకొనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఆమెకు కూడా ఈ సినిమా ఏ రకంగా ఉపయోగపడకపోగా రావాల్సిన అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
మంచు విష్ణు హీరోగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప( Kannappa )లో చాలామంది పెద్ద హీరోలు నటిస్తున్నారు అయితే ఈ చిత్రంలో శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ఏ మాత్రం ఆ పాత్రకు సూటు కాలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి.భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఇంత పెద్ద పాత్ర జనాలు యాక్సెప్ట్ చేయకపోతే ఊహించడానికి చాలా కష్టంగా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy