దర్శకుడు తేజ పరిచయం చేసిన టాలీవుడ్ హీరోలు వీరే !

ఆయన సినిమాలన్నీ ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్లు గానే ఉంటాయి.ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ ని క్రియేట్ చేస్తాడు.

ఇక అందరూ కొత్త హీరోలతో సినిమాలు చేయడానికి భయపడిపోతూ ఉంటే.ఇక ఆ దర్శకుడు మాత్రం కొత్త హీరో ఎప్పుడు దొరుకుతాడా అని వేచి చూస్తూ ఉంటాడు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త హీరోల ను పరిచయం చేశాడు ఆ దర్శకుడు.ఇటు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎంతో మంది కొత్త హీరోలకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు హీరోగా ఛాన్స్ ఇచ్చేశాడు.

ఆ దర్శకుడు ఎవరో కాదు తేజ.ఇప్పటికి ఎంతో మంది హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తేజ ఇక ఇప్పుడు మరో కొత్త హీరోని లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Advertisement
Heros Who Are Introduced By Director Teja Nitin Navadeep Uday Kiran Details, Ni

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ను ఇక తన డైరెక్షన్ లో టాలీవుడ్ హీరోగా పరిచయం చేస్తున్నాడు.అహింస అనే టైటిల్ తో వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది.

అభిరామ్ సరే ఇక ఇప్పటి వరకు తేజ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసిన హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ :

Heros Who Are Introduced By Director Teja Nitin Navadeep Uday Kiran Details, Ni

2000 సంవత్సరంలో తేజ ఫస్ట్ మూవీ చిత్రం. ఇక ఇదే సినిమాతో ఉదయ్ కిరణ్ ను టాలీవుడ్ హీరోగా పరిచయం చేశాడు.ఇక ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విషయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

నితిన్ :

Heros Who Are Introduced By Director Teja Nitin Navadeep Uday Kiran Details, Ni
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

జయం అనే సినిమాతో మరోసారి తేజ హీరో నితిన్ ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు ఇక 2002లో తేజ దర్శకత్వంలో టాలీవుడ్ హీరోగా పరిచయమైన నితిన్ ఇప్పటికి ఇండస్ట్రీలో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇక తేజ నితిన్ దర్శకత్వంలో వచ్చిన విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ జయం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

నవదీప్ :

Advertisement

ప్రస్తుతం హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నవదీప్ ని టాలీవుడ్ హీరోగా పరిచయం చేసింది దర్శకుడు తేజనే.విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన జై అనే సినిమా విజయం సాధించింది.ఇక ఈ సినిమాలో నవదీప్ హీరోగా పరిచయం అయ్యాడు.

ఇలా ఎప్పుడూ కొత్త హీరోల ని పరిచయం చేయడంలో ముందున్న దర్శకుడు తేజ ఇక ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మరో కొత్త హీరో అభిరామ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు.

" autoplay>

తాజా వార్తలు