తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు కలర్స్ స్వాతి( Swathi Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ స్వాతి ఆ మధ్య పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయింది.
ఇండస్ట్రీ లో ఆమె చేసిన సినిమా లు కొన్ని ఎప్పటికి నిలిచి పోయేవి ఉన్నాయి అనడంలో సందేహం లేదు.హీరోయిన్ గా స్వాతి చేసిన సినిమా లు ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాయి.
పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్న స్వాతి ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది.అందులో భాగంగానే తాజాగా మంత్ ఆఫ్ మధు( Month of Madhu ) అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా కు నెగటివ్ రివ్యూలు రావడం తో ఆమె అసహనం వ్యక్తం చేసింది.రివ్యూ లు రాసి సినిమా ను కిల్ చేస్తున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
రివ్యూ లకు సినిమా కలెక్షన్స్ కి ఏమాత్రం సంబంధం లేదు అని గతం లో పలు సందర్భా ల్లో నిరూపితం అయింది.రివ్యూల వల్ల కలెక్షన్స్ అయిదు నుంచి పది శాతం వరకు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయేమో.అంతే కాని అంతకు మించి ఎక్కువ తేడా ఉండదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయినా కూడా స్వాతి మాత్రం రివ్యూవర్స్ పై విరుచుకు పడటం విడ్డూరంగా ఉంది.సినిమా బాగుంటే రివ్యూల తో పని లేకుండా జనాలు థియేటర్లకు వెళ్తారు.
మ్యాడ్ సినిమా( MAD Movie ) కు మిశ్రమ రివ్యూలు వచ్చాయి.అయినా కూడా ఇప్పుడు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చేస్తున్న హడావుడి గురించి మనం చూస్తూనే ఉన్నాం.మొత్తానికి బుల్లి తెర మరియు వెండి తెరపై గతంలో ఎన్నో ప్రాజెక్ట్ లు చేసిన స్వాతికి రివ్యూల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కానీ కొత్త హీరోయిన్ మాదిరిగా రివ్యూల విషయం లో స్పందించడం విడ్డూరంగా ఉందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.స్వాతికి ఈ విషయంలో కూడా అవగాహణ లేదా అన్నట్లుగా కొందరు పెదవి విరుస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy