కోమాలోకి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు సావిత్రి చెప్పిన మాటలు

చాలామందికి మహానటి సావిత్రి( Savitri ) జీవితంలో ఏం జరిగింది అనేది తెరిచిన పుస్తకంలో మారిపోయింది.

ఆమె పేరు మీద వచ్చిన మహానటి చిత్రాన్ని చూసిన వారికి ఒక అవగాహన కూడా వచ్చింది.

నాటితరం వారికి సావిత్రి గురించి బాగానే తెలిసినప్పటికీ ఈ తరం వారికైతే తెలీదు.దానిని భుజాన వేసుకొని దర్శకుడు నాగ్ అశ్విన్  చాలా చక్కగా మహానటి సినిమాను తీశారు.

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డ్స్ పంట కూడా పండింది.సరే మహానటి సావిత్రి జీవితంలో ఉన్న అనేక విషయాలను తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె కోమాలోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు అంటే ముందు రోజు షూటింగ్లో పాల్గొంది.

ఆరోజు తన షూటింగ్లో ఏం జరిగింది? ఆమె మాట్లాడిన చివరి మాటలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Heroine Savitri Last Words , Savitri , Heroine Lakshmi , Tollywood, Nag Ashwi
Advertisement
Heroine Savitri Last Words , Savitri , Heroine Lakshmi , Tollywood, Nag Ashwi

మహానటి సావిత్రి కన్నడ సినిమా షూటింగ్ కోసం మైసూర్ వెళ్లారు.అక్కడ ప్రీమియర్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది.ఆ సినిమాలోనే షావుకారు జానకి కూడా నటిస్తున్నారు.

అక్కడే పక్క ఫ్లోర్లో హీరోయిన్ లక్ష్మీ నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతుందట.అయితే సావిత్రి సినిమా షూటింగ్ జరుగుతుంది అన్న విషయం తెలుసుకున్న లక్ష్మి షాట్ గ్యాప్ లో ఆవిడను కలవడానికి వచ్చారట.

లక్ష్మీ సినిమా సెట్ లో అడుగుపెట్టగానే అక్కడ షావుకారు జానకి ( Sankaramanchi Janaki )బొప్పాసకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసి అందరికీ పంచడం చూశారట.అది చూసిన లక్ష్మీ మీకు ఎందుకు అక్క ఇలాంటి పనులు అని అడిగారట.

దానికి మహానటి సావిత్రి జోక్యం చేసుకొని "దానికి అదొక పిచ్చి.అందరికీ పెడుతుంది.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

అలాగే వండి పెడుతుంది .అయినా దాని తిండి తిని దాన్నే తిడుతారు" అంటూ చాలా చనువుగా షావుకారు జానకి గురించి సావిత్రమ్మ మాట్లాడారట.

Heroine Savitri Last Words , Savitri , Heroine Lakshmi , Tollywood, Nag Ashwi
Advertisement

అయినా దానికి బుద్ధి రాదు మళ్లీ మళ్లీ పెడుతూనే ఉంటుంది.ఎప్పుడు మారుతుందో ఏమో అంటూ కూడా సరదాగా సెటైర్స్ వేశారట షావుకారు జానకిపై సావిత్రమ్మ.అదే సమయంలో వేరుశనగ కాయలు తింటున్న మహానటి సావిత్రమ్మ లక్ష్మి( Lakshmi )తో కాసేపు ముచ్చటించి షూట్ కి వెళ్ళిపోయారట.

ఆ మరుసటి రోజు సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది.కొన్ని నెలల పాటు పోరాటం చేసి జీవితంలో ఓడిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.ఆ తర్వాత అంతకు ముందు జరిగిన అనేక విషయాలు చాలా మందికి తెలిసిన ఈ విషయం షావుకారు జానకి ఓ ఇంటర్వ్యూలో చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియలేదు.

తాజా వార్తలు