అక్కడ షేప్, సైజ్ కోసం తెగ కష్టపడుతున్న సమంత.. లుక్కు మార్చేయాలంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha heroine ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

గత ఏడాది యశోద సినిమాతో( Yashoda movie ) సూపర్ హిట్ ని అందుకున్న సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో( Sakunthalam movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే సమంత తన ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

కెరియర్ పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.తరచూ జిమ్ ( GYM )లో వర్కౌట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.సమంత జీరో సైజ్ ప్యాక్( Samantha Zero Size Pack ) కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తారు.

Advertisement

తాజాగా ఆమె ఓ వర్క్ అవుట్ వీడియో షేర్ చేశారు.అందులో ఆమె కాఫ్ మజిల్స్ అనగా కాలి పిక్కలు పెంచేందుకు ఒక కఠిన ఎక్స్ర్సైజ్ చేశారు.

అది కూడా వంద రిపీట్స్ అట.వందసార్లు పూర్తి కాగానే బాధతో అల్లాడిపోయింది.ఆ వీడియో వైరల్ గా మారింది.

కాఫ్ మజిల్స్ షేప్, సైజ్ కోసం సమంత ఆ స్థాయిలో కష్టపడుతున్నారు.ఆ మాత్రం కష్టపడితే కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు రావడం కష్టం అని చెప్పవచ్చు.

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు సమంత డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పడంతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాటు ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే హిందీ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్ లో నటిస్తోంది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు.అలాగే ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

Advertisement

సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.

తాజా వార్తలు