ఫ్లాప్ హీరోయిన్ కు మరో ఛాన్స్.. అల్లరోడు అయినా ఈ బ్యూటీకి హిట్ ఇస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్లు మూవీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లను అందుకుంటున్న హీరోయిన్లలో రుహాని శర్మ( Ruhani Sharma ) ఒకరు.

అందం, అభినయంతో రుహాని శర్మ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.రుహాని శర్మ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలిచాయి.

రుహాని శర్మ నటించిన సినిమాలన్నీ మంచి సినిమాలే కావడం గమనార్హం.సితార బ్యానర్ పై అల్లరి నరేష్( Allari Naresh ) హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

సైంధవ్,( Saindhav ) ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమాలలో రుహాని శర్మ నటించగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి.అల్లరి నరేష్ సినిమాతో రుహాని శర్మ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

అయితే రుహాని శర్మకు తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఆఫర్లు వస్తున్నాయి.కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో నటించడానికి సైతం ఆమె ఇష్టపడుతున్నారు.రుహాని శర్మ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమాలో సైతం నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

కథ నచ్చితే ఓటీటీ ప్రాజెక్ట్ లలో నటించడానికి సైతం రుహాని శర్మ ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు.

రుహాని శర్మ సినీ కెరీర్ లో చిలసౌ, హిట్ లాంటి సినిమాలు ఉన్నాయి.ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు.రుహాని శర్మ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

రుహాని శర్మ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.రుహాని శర్మ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

అల్లరోడు అయినా రుహాని శర్మకు హిట్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు