ఇక్కడ పడితే... అక్కడ తేలింది! రెజీనాని రమ్మని పిలిచిన మలయాళీలు

తమిళ భామగా టాలీవుడ్ లో అడుగు పెట్టి అతి తక్కువ టైంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన నల్లపిల్ల రెజినాకి కెరియర్ ఆరంభంలో మంచి అవకాశాలు వచ్చాయి.

అయితే ఎందుకనో ఊహించని విధంగా టాలీవుడ్ లో ఆమె అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

ఆ సినిమా తర్వాత తెలుగు చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా చేయలేదు.ప్రస్తుతం తెలుగు నుంచి ఆమె సెవెన్ అనే సినిమాలో మాత్రమే నటిస్తుంది.

ఇక ఆ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది అనేది అర్ధం కాని విషయంగానే ఉంది.ఇక ఈ భామ గ్లామర్ డోస్ పెంచి తనలో కావాల్సినంత అందం ఉంది అని నక్షత్రం సినిమాలో చూపించిన తెలుగు దర్శకులు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక బాలీవుడ్ లో మంచి అవకాశం సొంతం చేసుకున్న ఈ భామ అక్కడ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.అయితే ఆ పాత్ర కంటే సోనమ్ చేసిన పాత్ర ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిపోవడం రెజినాని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

Advertisement

ఇక సొంత భాష తమిళంలో కూడా రెజినాకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.అయితే ఇప్పుడు ఊహించని విధంగా మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి రెజినాకి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్ బ్రదర్ సినిమాలో రెజినాని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమా ఆమె లక్ ని మారుస్తుందేమో వేచి చూడాలి.

Advertisement