నా కొడుకు అమర్ కు ఓటేయాలన్న రాశి.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీ షాకిచ్చారుగా!

బిగ్ బాస్ సీజన్7( Bigg Boss Season 7 ) విన్నర్ ఎవరనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కొంతమంది శివాజీ పేరు చెబితే మరి కొందరు పల్లవి ప్రశాంత్ పేరు చెబుతున్నారు.

ఈ ఇద్దరు కంటెస్టెంట్లలో విజేత ఎవరవుతారో చూడాల్సి ఉంది.ప్రముఖ నటి రాశి తాజాగా తన కొడుకు అమర్ దీప్ కు ఓటేయాలని కామెంట్ చేశారు.

అమర్ దీప్( Amardeep ) సీరియల్ లో కొడుకు పాత్రలో నటించడంతో రాశి ఈ విధంగా కామెంట్ చేశారు.

అయితే రాశి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కాగా పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) ఫ్యాన్స్ ఆమెకు భారీ షాకిచ్చారు.అమర్ దీప్ కు సపోర్ట్ చేయవద్దని నెటిజన్లు కామెంట్లు చేయడంతో పాటు మీరు చెబితే మేము ఓటేయాలా అని మరి కొందరు చెబుతున్నారు.అమర్ దీప్ కుటుంబ సభ్యులను సైతం టార్గెట్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీ షాకివ్వడం గమనార్హం.

Advertisement

అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పల్లవి ప్రశాంత్ విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.కొంతమంది పల్లవి ప్రశాంత్ గురించి పాజిటివ్ గా చెబితే మరి కొందరు నెగిటివ్ గా చెబుతున్నారు.పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ షో సీజన్7 ను సక్సెస్ చేయడానికి ఈ షో మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్7 రేటింగ్స్ మరీ గొప్పగా మాత్రం లేవు.

బిగ్ బాస్ హౌస్ లోకి రతిక( Rathika ) రీఎంట్రీ గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.బిగ్ బాస్ షోలోకి ఆమెను పంపి తప్పు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

రతికకు సినిమా ఆఫర్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండగా ఆమె కెరీర్ పరంగా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు