Rakul Preet Singh : నా తొలి రెమ్యునరేషన్ అంతే.. వాళ్ల వల్లే ఈ స్థాయికి చేరుకున్నా.. రకుల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.కాగా మొన్నటి వరకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.

ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

కాగా తెలుగులో రకుల్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సందీప్ కిషన్, రామ్ పోతినేని, నాగ చైతన్య లాంటి హీరోల సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నాని( Jackky Bhagnani ) తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట రేపు అనగా ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.

Advertisement

గోవా( Goa )లో వారి వివాహం ఘనంగా జరగనుంది.ఈ క్రమంలో ఆమె జర్నీని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి సాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేకుంటే సమస్యలు తలెత్తుతాయని ఆమె తెలిపింది.

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.

నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి నాకు 25 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ ఎప్పుడూ తోడుగా నిలిచింది.నా కెరియర్‌ మోడలింగ్‌తోనే ప్రారంభమైంది.అలా నేను మొదట అందుకున్న రెమ్యునరేషన్‌ రూ.5 వేలు( First Remuneration ) అక్కడి నుంచి నేడు ఈ స్థాయికి చేరుకున్నానంటే అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమే.నా వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్‌ చేయాల్సి వచ్చేది అని రకుల్‌ తెలిపింది.

ప్రస్తుతం రకూల్‌ మేరీ పత్నీ కా రీమేక్‌, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం తన పెళ్లి కావడంతో ఆ హడావుడిలో ఫుల్ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు