టాలీవుడ్ ఇండస్ట్రీలో రక్తచరిత్ర, లయన్,లెజెండ్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రాధిక ఆప్టే ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరం అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక ఈమె సినిమాలలో ఎంతో బోల్డ్ పాత్రలలో నటించడమే కాకుండా నగ్నంగా నటించడానికి కూడా సై అంటుంది.
ఇలా తన బోర్డ్ గ్లామర్ తో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేసే రాధిక ఆప్టే తాజాగా కెరియర్ మొదట్లో తన శరీరాకృతి గురించి ఇతరుల నుంచి ఎదుర్కొన్న ఒత్తిడి గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంతో మంది నా శరీరాకృతి పై కామెంట్లు చేశారు.
ఇండస్ట్రీలో నటిగా కొనసాగాలి అంటే శరీరాకృతి ఎంతో అవసరమని అందుకోసం సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుందని చాలా మంది తనకు హితబోధ చేసినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే కొందరు నా ముక్కు గుండ్రంగా ఉంది షార్ప్ చేయించుకోమని సలహా ఇవ్వగా, మరికొందరు బూబ్ జాబ్ (స్థనాలు పెంచుకోవాలని) చేయించుకోవాలని కొందరు అడిగారు.
అదేవిధంగా నా కాళ్ళ సౌదర్యానికి, అలాగే బోటాక్స్ ను రీఫిల్ చేయాలని కూడా చెప్పారు.
అయితే సాధారణంగా నేను ఒక చిన్న ఇంజక్షన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడను.అదే నన్ను సర్జరీలు చేయించుకోకుండా ఆపిందని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.తాను తన శరీరాన్ని ఎంతో ప్రేమిస్తానని అందుకే ఇతరులు ఇలా సర్జరీలు చేయించుకుని సలహా ఇస్తున్న సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యానని, అయితే ఇవేవీ నాపై ప్రభావం చూపించలేదని ఈ సందర్భంగా రాధిక ఆప్టే కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఒత్తిళ్లు గురించి తెలిపారు.
అయితే ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది అగ్రహీరోయిన్ లు అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల సర్జరీలు చేయించుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇలాంటి సర్జరీకి తాను పూర్తిగా వ్యతిరేకమని రాధిక ఆప్టే కుండబద్దలు కొట్టినట్టు తెలియజేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy