Nekeet Dhillon Punjabi Actress: హ్యాకర్ చేసిన పనికి డిప్రెషన్ కు గురైన హీరోయిన్.. ఆ నటి ఎవరంటే?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న ట్రోలింగ్స్ ఎక్కువ అయ్యాయి.

మరి ముఖ్యంగా కొందరు నేరగాళ్లు హ్యాకర్స్ నెటిజన్స్ కొంతమంది హీరో హీరోయిన్ లను టార్గెట్ చేస్తూ మన సోషల్ మీడియా అకౌంట్ ని హ్యాక్ చేయడం వాళ్లపై లేనిపోని వార్తలన్నీ సృష్టించి వారి గురించి చెడుగా ప్రచారం చేయడం లాంటివి చేస్తున్నారు.

అంతేకాకుండా వాళ్ళపై ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేయడం లాంటివి చేస్తున్నారు.అయితే అలాంటి వార్తలు వైరల్ చేయడం వల్ల సదరు సెలబ్రిటీలు ఎంత బాధ పడతారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన విధంగా చేస్తూ ఉంటారు.

తాజాగా ఒక నటికి అలాంటి చేదు సంఘటన ఎదురైంది.పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రముఖ పంజాబీ ప్రముఖ నటి నికిత్ ధిల్లోన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఇటీవలే హ్యాక్ అయిన విషయం అందరికీ తెలిసిందే.దీంతో ఒక దుండగుడు నికిత్ చనిపోయిందని ఆమె అకౌంట్ లోనే పోస్ట్ చేశాడు.

Advertisement

మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది.మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని అందులో హ్యాకర్ రాసుకొచ్చాడు.

వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ వార్త చూసి తాను ఎంతో మనోవేదనకు గురైనట్లు నికిత్ తెలిపింది.

అంతేకాకుండా ఆ సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనను అనుభవించారని ఆమె చెప్పుకొచ్చింది.అయితే అది పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది అనుకున్నారని కానీ ఆ విషయం వల్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంత షాక్ అయ్యారో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.తన అమ్మమ్మ భటిండాలో నివసిస్తోందని, ఆమెకు ఎవరో ఫోన్ చేసి నికిత్ చనిపోయిందని చెప్పడంతో వెంటనే తన అమ్మని పిలిచి చాలా ఏడ్చిందని తెలిపింది నికిత్.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

అప్పుడు ఆమె మానసికంగానూ కుంగిపోయిందని, అప్పుడు అందరు కలిసి నికిత్ అమ్మమ్మకు జరిగిన విషయాన్ని ఎంత మంది చెప్పినప్పటికీ ఆమె మాత్రం ఎమోషనల్ అవుతూనే ఉంది అని చెప్పుకొచ్చింది నికిత్.

Advertisement

తాజా వార్తలు