చేతి నిండా సినిమాలు కానీ రిలీజ్ ఎప్పుడూ..?

మన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌( Nidhi Agarwal ) పరిస్థితి చాలా దారుణం గా తయారైంది.

ఆమె కెరీర్ చూసినప్పుడు ఆమెకెంటి ఫుల్ బిజీ గా ఉంది అనుకుంటాం.

కానీ అసలు కథ వేరే ఉంది.చాలా మంది హీరోయిన్లకు మంచి అవకాశాలు రావడం లేదు.

ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడం లేదు.అలాంటి వారి పక్కన నటించడం అంటే చాలా అదృష్టం అనుకోవాలి.

కానీ నిధి కి ఆఫర్‌ రావడంతో ఇబ్బంది లేదు, అది సినిమా విడుదల వరకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది.నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైంది.

Advertisement

సినిమా సక్సెస్ కాకపోయినా ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.అందుకే ఆమెకు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాలో అవకాశం వచ్చింది.

ఆ సినిమా హిట్ అయింది.ఈ సినిమాలో నిధి అందానికి, నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

ఆ సక్సెస్ తో ఆమెకు రెండు భారీ ప్రాజెక్ట్‌ ల ఛాన్స్ లు కూడా అందాయి.నిధి కెరీర్ ఇక రాకెట్ లా దూసుకుపోతుందని వారు అనుకున్నారు.

కానీ మొత్తం రివర్స్ అయింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

నిధి మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీర మల్లు( Harihara Veeramallu ) చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది.ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేస్తామని ప్రకటించారు.ఈ బ్యూటీ కూడా కొన్ని రోజులు షూటింగ్ కి వెళ్లింది.

Advertisement

ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. అసలు ఎందుకో తెలియదు కానీ సినిమా ప్రారంభం నుంచి వాయిదా పడుతూ వస్తోంది.

మళ్లీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు.అసలు సినిమా ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు.

పవన్‌తో( Pawan Kalyan ) నటించడం వల్ల తన కెరీర్‌ మారిపోతుందని ఆమె భావిస్తోంది.కానీ అలా జరగలేదు.

సరే, పవన్ సినిమా ప్రారంభం కాకపోతే పోయింది.ప్రభాస్ ( Prabhas ) సినిమా ఉందనుకుంది.ప్రభాస్ మారుతి హారర్ కామెడీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధిని కూడా అనుకున్నారు.అయితే అది కూడా ఇప్పట్లో విడుదలయ్యేలా కనిపించడం లేదు.

ప్రభాస్ చేతిలో భారీ లిస్ట్ ఉంది.సలార్ షూటింగ్ జరుగుతోంది.

ఆ తర్వాత ప్రాజెక్ట్ కే ఉంది.దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు.

ఈలోగా ఈ హీరోయిన్ ని మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నిధి ఉన్న ఇబ్బందుల్లో ఈ రెండు సినిమాలు విడుదల కావడం ఎంతో ముఖ్యం.

ఇలా నిధి చేసేవి పెద్ద సినిమాలు అయిన అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక చాలా ఇబ్బంది పడుతుంది.

తాజా వార్తలు