ఆ స్టార్ హీరోయిన్ల కంటే కీర్తి సురేష్ 100 రెట్లు బెటర్.. ఆఫర్లు ఇవ్వండయ్యా?

దసరా సినిమా( Dasara Movie ) థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కీర్తి సురేష్ పోషించిన వెన్నెల పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ పాత్రలో కీర్తి సురేష్ నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పడం కరెక్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.మహానటి సినిమా తర్వాత ఆ రేంజ్ రోల్ కీర్తి సురేష్ కు దక్కిందని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగులో కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు( Star Heroines )గా వెలుగు వెలుతున్నా సరైన ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం కూడా వాళ్లకు చేత కావడం లేదు.ఆ హీరోయిన్లకు అసలు యాక్టింగ్ రాదని ఆయా హీరోయిన్ల అభిమానులు సైతం అంగీకరిస్తారు.ఆ స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే కీర్తి సురేష్( Keerthy Suresh ) 100 రెట్లు బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కీర్తి సురేష్ నటనకు ఎక్కడా వంకలు పెట్టలేమనే సంగతి తెలిసిందే.

Advertisement

పాత్ర కోసం ఎంతైనా కష్టపడే అతికొద్ది మంది నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు.గ్లామర్ రోల్( Glamor Role ) అయినా అభినయ ప్రధాన పాత్ర అయినా కీర్తి సురేష్ తనదైన ముద్ర వేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే కీర్తి సురేష్ రెమ్యునరేషన్ సైతం తక్కువనే సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ కు దిగ్గజ స్టార్ డైరెక్టర్లు( Star Directors ) ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరి కీర్తి సురేష్ కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు నిజంగా ఛాన్స్ ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కీర్తి సురేష్ టాలీవుడ్ లో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు