Gayathri Raghuram: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి పాపులర్ హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోయిన్లు వయసైపోయేంతవరకు నటించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

ఈ కాలంలో ఒకటి, రెండు చిత్రాలతోనే హీరోయిన్ల భవిష్యత్తు తెలిసిపోతుంది.కొందరు మొదటి చిత్రం తోనే స్టార్లుగా మారిపోతుంటే.

మరీ కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేసాక కనుమరుగైపోతున్నారు.తాజాగా ఒక తెలుగు హీరోయిన్( Telugu Heroine ) గుండు చేసుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసింది రెండు సినిమాలే అయినా, ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Advertisement

గాయత్రీ రఘురాం.( Gayathri Raghuram ) ఈమె అందరికి తెలియకపోవచ్చు.ఎందుకంటె ఈమె చాల తక్కువ చిత్రాలలో నటించింది.

ఈమె నటించిన మొదటి చిత్రం "రేపల్లెలో రాధ".( Repallelo Radha ) ఈ చిత్రం 2001 లో విడుదలయింది.

ఐతే ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేదు.ఈమె నటించిన రెండో చిత్రం "బాపుబొమ్మకు పెళ్ళంటా".

( Bapubommaku Pellanta Movie ) 2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.ఈ చిత్రంలో రెండు జాడలు వేసుకొని కుందనపు బొమ్మలా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన అమ్మాయే ఈ గాయత్రీ రఘురాం. రెండో చిత్రంతోనే ఫేమస్ ఐనప్పటికీ, ఈమె తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.2006 లో దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల వీరు 2010 లో విడాకులు తీసుకున్నారు.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!

తరువాత ఆమె కొంత కాలం బీజేపీ తో( BJP ) కలిసి పని చేసారు.కొంత కాలం తరువాత పార్టీ నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు.నితిన్ హీరోగా నటించిన "రంగ్ దే"( Rang De Movie ) సినిమాలో హీరో సోదరిగా నటించింది గాయత్రి.

Advertisement

ఈమె కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.ఐతే ఈమె ఈమధ్యే తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.అక్కడ తలనీలాలు కూడా సమర్పిచారు.

ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, గుర్తుపట్టలేనంతగా మారిన గాయత్రిని చూసి షాక్ అవుతున్నారు.

తాజా వార్తలు