ఝాన్సీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ తిరు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఝాన్సీ. ఈ సినిమా యాక్షన్ నేపథ్యంలో రూపొందింది.

ఇక ఇందులో అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రుద్ర ప్రతాప్, ముమైత్ ఖాన్ తదితరులు నటించారు.శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ సినిమాను కృష్ణ కుల శేఖరన్, కేఎస్ మధుబాల నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ సినిమా ఈరోజు ఓటిటి వేదికగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే ఇందులో అంజలి ఝాన్సీ పాత్రలో నటించింది.ఇక ఆదర్శ బాలకృష్ణ సంకీత్ అనే పాత్రలో కనిపించాడు.

Advertisement

ఇక ఝాన్సీ, సంకీత్ కు కొన్నేళ్ల క్రితం కేరళలో పరిచయం ఏర్పడటంతో వాళ్లు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు.అప్పటికే ఝాన్సీ కి లైఫ్ లో ఏం జరిగిందో గుర్తుకు ఉండదు.

దాంతో గతం మర్చిపోయిన ఝాన్సీని సంకీత్ దగ్గర చేసుకుంటాడు.ఇక ఝాన్సీ కి మధ్యలో ఏవేవో పీడ కలల రూపంలో కొన్ని సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి.

ఆ క్రమంలో తనకు తన పేరు ఝాన్సీ కాదని తెలుస్తుంది.ఇంతకీ ఝాన్సీ అసలు పేరు ఏంటి.

గతం మర్చిపోవటానికి అసలు సంఘటన ఏంటి.తను అలా మారిపోవడానికి ఎవరు కారణం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

చివరికి నిజం ఎలా బయటపడుతుంది అనేది మిగిలిన కథలోనిది.

Advertisement

నటినటుల నటన:

అంజలి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది.ముఖ్యంగా తన పాత్రలో లీనమైంది.

ఇక చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రుద్ర ప్రతాప్, ముమైత్ ఖాన్ తదితరులు నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమాకు దర్శకుడు రొటీన్ కథను అందించాడు.అయినా కూడా యాక్షన్స్ సన్నివేషాలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి.

శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు పూర్తిగా పనిచేశాయి.

విశ్లేషణ:

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ కొత్తది ఏమీ కాకున్నా కూడా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చిందని చెప్పవచ్చు.ఇక ట్విస్టులు మాత్రం ఇదివరకు వచ్చినట్లే అనిపిస్తాయి.చాలావరకు పాత కథలో తీసుకున్న కథలాగే అనిపిస్తుంది ఈ కథ.ఇక కేవలం అదే కాకుండా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాన్ని కూడా చూపించాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.పాత్రలు అద్భుతంగా ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకుంది.

నటీనటుల నటన కూడా అద్భుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్:

రొటీన్ కథ లాగా అనిపించింది.లాజిక్స్ లేనట్లుగా అనిపించింది.కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగినట్లు అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే.రొటీన్ గా వచ్చిన కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల ద్వారా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5

తాజా వార్తలు