పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నగళ్ల.. ఈ నటి నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే!

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో( Pahalgam ) జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తులలో నెల్లూరు( Nellore ) జిల్లాకు చెందిన మధుసూధనరావు( Madhusudhan Rao ) కూడా ఒకరు.

ఒక ఈవెంట్ కొరకు నెల్లూరుకు వెళ్లిన అనన్య నగళ్ల( Ananya Nagalla ) ఈ విషయం తెలిసి బాధితుడి ఇంటికి వెళ్లి మధుసూధనరావు భౌతికఖాయానికి నివాళులు అర్పించారు.సెలబ్రిటీలలో ఏ ఒక్కరూ చెయ్యని పని చేసి అనన్య ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ నటి నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ ఘటన గురించి అనన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పహల్గామ్ సంఘటన నాకెంతో బాధ కలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఒక ఈవెంట్ కొరకు నెల్లూరుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.

Advertisement

ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి స్వస్థలం నెల్లూరు పక్కన కావలి అని తెలిసి అని తెలిసి చూడటానికి వచ్చానని ఆమె అన్నారు.మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నానని వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఖండించాలని ఆమె చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండటానికి మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అనన్య అన్నారు.అనన్య నగళ్ల నిజమైన హీరోయిన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అనన్య నగళ్ల పోస్ట్ కు 8200కు పైగా లైక్స్ వచ్చాయి.

హీరోయిన్ అనన్య నగళ్ల ప్రస్తుతం కెరీర్ పరంగా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.అనన్య నగళ్ల కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు