మాస్ మహారాజ రవితేజ( Raviteja ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
త్వరలోనే ఈయన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswararao ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక రవితేజ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రవితేజ ప్రమోషన్ కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో జాతీయ మీడియాతో కూడా ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రవితేజకు ఈ హీరోల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ తనకు రామ్ చరణ్, విజయ్ హీరోల డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
అలాగే రాజమౌళి ఒక విజన్ అంటూ తెలిపారు.ఇక ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అంటూ ఈయన ప్రభాస్ గురించి తెలియజేశారు.ఇంతవరకు బానే ఉన్నప్పటికీ కన్నడ స్టార్ హీరో యష్ ( Yash ) గురించి కేజిఎఫ్ ( KGF ) సినిమా గురించి ఈయన మాట్లాడినటువంటి ఒకే ఒక్క మాట ద్వారా భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
కే జి ఎఫ్ లాంటి సినిమా దొరకడం నిజంగా యశ్ ( Yash )అదృష్టం అంటూ రవితేజ( Raviteja ) తెలిపారు.ఇక నేను ఈ సినిమా తప్ప యశ్ నటించిన సినిమాలు ఏవి చూడలేదని కూడా ఈయన తెలిపారు.దీంతో యశ్ అభిమానులు రవితేజ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు కన్నడ సినిమాలో సైడ్ యాక్టర్ గా పనిచేస్తున్నటువంటి నువ్వ కే జి ఎఫ్ సినిమా యశ్ కి దొరకడం లక్కీ అంటూ కామెంట్ చేయడం ఏమాత్రం బాగాలేదు అంటూ యశ్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈయనపై ఇలాంటి ట్రోల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్( Ravi Teja fans ) కూడా స్పందిస్తూ అలాంటి గొప్ప సినిమా దొరకడం నిజంగా తన అదృష్టం అని చెప్పడంలో తప్పేముంది దానికి ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అంటూ రవితేజ ఫాన్స్ కూడా ఈ ట్రోల్స్ పై కామెంట్ చేస్తూ తమ హీరోకి మద్దతుగా నిలబడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy