పదవ తరగతి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు హీరో విజయ్ బంపర్ ఆఫర్..!!

తమిళ హీరో దళపతి విజయ్( Thalapathy Vijay ) అందరికీ సుపరిచితుడే.

తమిళ సూపర్ స్టార్ గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో కోలీవుడ్ ఇండస్ట్రీలో( Kollywood ) టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరసలో ఉండే హీరో విజయ్.

మనోడు సినిమా విడుదల అయ్యిందంటే చాలు తమిళ బాక్సాఫీస్ వద్ద డబ్బులే డబ్బులు.తమిళంలో రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే హీరోలలో విజయ్ ఒకరు.

ఈ ఏడాది ప్రారంభంలో "వారసుడు" సినిమాతో( Varasudu Movie ) సూపర్ డూపర్ హిట్ అందుకోవటం జరిగింది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను.

దిల్ రాజు నిర్మించారు.విజయ్ కెరియర్ లో అతిపెద్ద హిట్ సినిమాగా "వారసుడు" రికార్డులు క్రియేట్ చేసింది.

Hero Vijay Bumper Offer For 10th Class Inter Pass Students Details, Kollywood,
Advertisement
Hero Vijay Bumper Offer For 10th Class Inter Pass Students Details, Kollywood,

కాగా సినిమా పరంగా తిరుగులేని ఇమేజ్ అన్న విజయ్ సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో ఈ ఏడాది పదవ తరగతి మరియు ఇంటర్ పాసైన తమిళ విద్యార్థులకు చేయూత ఇవ్వడానికి విజయ్ ముందుకు రావడం జరిగింది.దీనిలో భాగంగా "విజయ్ మక్కల్ ఇ యక్కం" తరపున ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున సాయం చేయటానికి నిర్ణయం తీసుకున్నారు.

దీంతో జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులకు.విద్యార్థుల సమాచారం సేకరించాలని హీరో విజయ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈనెల 17వ తారీఖున .తనవంతుగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింతగా ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం చేయడానికి హీరో విజయ్ రెడీ అయ్యారు.దీంతో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు