నేను చేసిన తప్పు నిజ జీవితంలో మీరు ఎవరు చేయొద్దు... అభిమానులను వేడుకున్న సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) త్వరలోనే రెట్రో (Retro)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సూర్య  పూజా హెగ్డే (Pooja Hedge)హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా మే 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక సూర్యకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో సూర్య నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదలవుతుంది.ఇక రెట్రో సినిమా కూడా తెలుగులో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే నటుడు సూర్య తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

తిరువనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రమోషన్  కార్యక్రమంలో సూర్య పాల్గొని అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు.అభిమానులు అందరికీ కూడా ఒక హెచ్చరిక నేను సినిమాలో సన్నివేశాల కోసమే సిగరెట్లు తాగేలా నటించాను.

Advertisement

కానీ మీరు ఎవరు నిజజీవితంలో ఆ తప్పు పనిచేయదు అంటూ అభిమానులను కోరారు.

ఎవరు కూడా పొగకు బానిస కావద్దని పొగతాగడం ఒకసారి మొదలుపెడితే సులభంగా వదిలించుకోలేని వ్యసనంగా మారుతుందన్నారు.ఒక్క పఫ్ లేదా ఒక్క సిగరెట్‌తో మొదలుపెడతారు.కానీ ప్రారంభించాక దాన్ని ఆపడం చాలా కష్టం.

నేను దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించను.మీరు కూడా చేయకండి అని హితవు పలికారు.

ఇలా అభిమానులకు సిగరెట్ తాగొద్దు అంటూ ఈయన వేడుకోవడంతో సూర్య అభిమానుల పట్ల చూపించే కేరింగ్ కి ఫిదా అవుతున్నారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు