అనిల్ రావిపూడి లాంటి దర్శకుడిని ఇంతవరకు చూడలేదు.. సునీల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో, కమెడియన్ అయిన సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించిన సునీల్, ఆ తర్వాత హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గానే చేశాడు.అలా టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు సునీల్.

ఇక ఇటీవలే విడుదల పుష్ప సినిమాలో విలన్ గా కూడా నటించి మంచి మార్కులు కొట్టేశాడు.ఇక సునీల్ ఎఫ్ 3 సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇందులో పాత సునీల్ ను చూస్తామని మొన్న స్టేజ్ పై వరుణ్ చెప్పిన దగ్గర నుంచి సినిమాలో సునీల్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి అలీ షోకి వచ్చారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే సునీల్ తనదైన స్టైల్లో సందడి చేశాడు.ఈ షోలో భాగంగా సునీల్ మాట్లాడుతూ.

అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్ 3 సినిమా కోసం దాదాపు 70 రోజులు పని చేశానని, ఇన్ని రోజుల్లో నేను ఆయనను చాలా దగ్గరగా చూశానని,ఆయనను ఎప్పుడు చూసిన కూడా చాలా ఎనర్జీతో కనిపిస్తాడని,ఆయనని చూస్తే మనకి కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పుకొచ్చారు సునీల్.అనిల్ గారు కష్టపడే విధానం చూసి నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను.

ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి ఎవరూ సినిమా తీయలేరు.ఇక సెట్లో అయితే ఆయన ఇంతవరకు ఎవరిపైనా ఏ విషయంలో కూడా కోప్పడటం నేను చూడలేదు.

భోజన సమయం కాగానే అందరం కలిసి కూర్చుని తిందామని చెప్పి సరదాగా అందరితో కూర్చొని కలిసి భోజనం చేస్తాడు.ప్రతి ఒక్కరికీ కూడా ఆయన తన ఫ్యామిలీలో మెంబర్ లా అనిపిస్తాడు అని తెలిపారు సునీల్.అందుకే షూటింగ్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా కారవాన్ కి వెళ్లేవాడిని కాదు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఆయనతో కలిసే భోజనం చేసేవాడిని అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు సునీల్.

Advertisement

అంతే కాకుండా అదే రోజున మరొక షూటింగు ఉందనీ అంటే చాలామంది డైరెక్టర్లు అయితే విసుక్కుంటారు.కానీ అనిల్ గారు మాత్రం ఫలానా సమయానికి అక్కడికి వెళ్లాలని చెబితే అనిల్ మాత్రం సాధ్యమైనంత త్వరగా పంపించేయాలని చూస్తాడు అని తెలిపాడు సునీల్.ఇలా ఒక ఆర్టిస్టును అర్థం చేసుకొని సహకరించే దర్శకుడిగా నేను మొదట రాఘవేంద్రరావుని చూశాను ఆ తర్వాత ఈ జనరేషన్ లో అనిల్ రావిపూడి గారిని మాత్రమే చూస్తూ ఉన్నాను అని తెలిపారు.