ప్రసన్నవదనం మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస విజయాలు సాధించాలంటే లక్ ఉండాలి.అయితే హీరో సుహాస్(Suhas) కు మాత్రం ఆ అదృష్టం పుష్కలంగా ఉంది.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సుహాస్ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారు.సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం(prasannavadanam) మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

కథ :

ఆర్జేగా పని చేసే సూర్య ( సుహాస్) ఒక ప్రమాదంలో పేరెంట్స్ ను కోల్పోవడంతో పాటు ప్రోసాపాగ్నోసియా అనే అరుదైన వ్యాధి బారిన పడతాడు.ఫేస్ బ్లైండ్ నెస్ కు సంబంధించిన ఈ సమస్య వల్ల సూర్య ఇతరుల ముఖాలను, వాయిస్ ను గుర్తించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు.ఈ సమస్య గురించి ఇతరులకు చెప్పడం ఇష్టం లేని సూర్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విఘ్నేష్ (వైవా హర్ష) (Viva Harsha) కు తప్ప ఎవరికీ ఈ సమస్య గురించి చెప్పడు.

Advertisement

ఆ తర్వాత ఆద్య (పాయల్ రాధాకృష్ణ)(Payal Radhakrishna)తో ప్రేమలో పడిన సూర్య తన కళ్ల ముందు జరిగిన ఒక హత్య వల్ల ఇబ్బందుల్లో పడతాడు.అయితే ఊహించని విధంగా సూర్యనే ఈ కేసులో తనే హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ సమస్యల నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు ? హత్య చేసింది ఎవరు ? ఆద్యతో సూర్య లవ్ సక్సెస్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

ఈ మధ్య కాలంలో దర్శకులు హీరో పాత్రకు డిజార్డర్ పెట్టి కథను నడిపించడం తరచూ చూస్తూనే ఉన్నాం.సుహాస్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నంగా ఉంది.సరదా సన్నివేశాలతో మొదలైన సినిమా హీరో హత్యను చూడటంతో మలుపు తిరుగుతుంది.

ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

సూర్య పాత్రకు తన నటనతో సుహాస్ ప్రాణం పోశారనే చెప్పాలి.టెక్నికల్ గా కూడా ఈ సినిమా టాప్ రేంజ్ లో ఉంది.విజయ్ బుల్గానిన్ బీజీఎం, చంద్రశేఖరన్ (Vijay Bulganin BGM, Chandrasekaran)సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి.

Advertisement

డైరెక్టర్ అర్జున్ తొలి సినిమాతోనే ప్రతిభ చూపి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సుహాస్ నటన, సెకండాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :

ఇంట్రడక్షన్ సన్నివేశాలు

రేటింగ్ :

3.0/5.0 .

తాజా వార్తలు