Srikanth : ఇంకా ఏదో వెలితి… అసంపూర్తిగా ఉంటున్న హీరో శ్రీకాంత్ కెరియర్

హీరో శ్రీకాంత్( Srikanth ).పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాలో నక్సలైట్ పాత్రలో తొలిసారిగా 1991లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

చాలా ఏళ్లపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, చిన్న చిన్న పాత్రల్లో చివరికి విలన్ గా కూడా నటించాడు.అతడికి బ్రేక్ రావడానికి చాలా సమయం పట్టింది.

దాదాపు 10 నుంచి 15 సినిమాల తర్వాతే అతడికి ఈ హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.తాజ్ మహల్ వంటి సినిమాతో క్లిక్ అయ్యి ఆ తర్వాత పెళ్లి సందడి( pelli sandadi ) వంటి సినిమాతో స్టార్ నటుడుగా అవతరించాడు.

ఇక ఆ తర్వాత వేడి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు దాదాపు 2014 వరకు హీరో గానే సినిమాలు చేస్తూ వచ్చాడు.గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలో సైడ్ పాత్ర చేసి ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యాడు.

Advertisement

ఇక ఆ తర్వాత మెయిన్ విలన్ గా జగపతిబాబు( jagapathibabu ) లాగానే బిజీ అవ్వాలని ప్రయత్నించినా కూడా శ్రీకాంత్ కి ఎందుకు అది సాధ్యం కాలేదు.అఖండ వంటి సినిమాలో ఒక కర్కశమైన పాత్రలో కనిపించడానికి ప్రయత్నం చేస్తున్న కూడా సరైన గుర్తింపు అయితే రావడం లేదు.పూర్తిస్థాయి విలన్ గాను అలాగే విననిజం ఉండే నెగటివ్ పాత్రలో నటించాలని శ్రీకాంత్ ఎంతగానో ఉవ్విళ్లు వూరుతున్నప్పటికీ శ్రీకాంత్ ని హీరోగా జనాలు యాక్సెప్ట్ చేయలేరేమో అనే అనుమానం దర్శకుల్లో ఉండడంతో అది సాధ్యం కావడం లేదు.2020లో ఒక సినిమాలో కూడా నటించని శ్రీకాంత్ 2021లో మూడు సినిమాల్లో నటించాడు ఆ తర్వాత 2023లో వారిసు తమిళ చిత్రంలో, జేమ్స్ అనే కన్నడ సినిమాలో కనిపించాడు.

సుధీర్ బాబు హీరో గా నటించిన హంట్( Hunt ) సినిమాలో శ్రీకాంత్ లీడ్ రోల్ లో నటించగా ప్రస్తుతం అతని చేతిలో మరే సినిమా కూడా లేదు.తెలుగు సినిమాలతో పాటు కన్నడ తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న శ్రీకాంత్ వెబ్ సిరీస్ మరియు ఓటిటి ప్లాట్ఫామ్ చిత్రాల్లో కూడా కనిపిస్తున్నాడు.అయితే ఇంకా అతడి కెరీర్లో ఏదో ఒక వెలితి ఉండనే ఉంది.

మరోవైపు కొడుకుని హీరోగా లాంచ్ చేసినా కూడా ఒక మంచి సినిమా పడలేదు అనే భావన కూడా ఉంది.ఇక శ్రీకాంత్ నుంచి అభిమానులు చాలా ఆశిస్తున్న చేస్తున్న ఈ సందర్భంగా అతడు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుందాం.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు