పుష్ప 2 సినిమాపై హీరో సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్... నా దృష్టిలో అన్ని ఒకటే అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో నటుడు సిద్దార్థ్( Siddharth ) ఒకరు.

ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇకపోతే ఇటీవల కాలంలో సిద్దార్థ్ నటిస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఈ క్రమంలోనే సిద్ధార్థ సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి.

ఇకపోతే ఈయన మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.త్వరలోనే సిద్దార్థ్ మిస్ యు( Miss You ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Hero Siddarth Sensational Comments On Pushpa 2 Movie Release Details, Pushpa 2,

ఈ సినిమా నవంబర్ 29వ తేదీ పరీక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుందని చిత్ర బృందం ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు.

Advertisement
Hero Siddarth Sensational Comments On Pushpa 2 Movie Release Details, Pushpa 2,

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను కూడా ఇప్పుడు తెలంగాణ అల్లుడినే అంటూ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.ఇక ఈ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) విడుదల కాబోతుంది ఈ సినిమా ప్రభావం సిద్దార్థ్ సినిమాపై ఉంటుందనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

Hero Siddarth Sensational Comments On Pushpa 2 Movie Release Details, Pushpa 2,

ఈ ప్రశ్నకు సిద్దార్థ్ సమాధానం చెబుతూ.పుష్ప సినిమా విడుదలయితే నాకేంటి నా దృష్టిలో సినిమాలన్నీ కూడా ఒకటేనని తెలిపారు.సినిమా బడ్జెట్ ను బట్టి అది పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా ఉంటుంది కానీ నాకు మాత్రం సినిమాలన్నీ సమానమే.

నా సినిమా బాగుంటే పుష్ప 2 సినిమా విడుదల అయినా కూడా థియేటర్ నుంచి నా సినిమాను ఎవరు తీసేయలేరు.ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్ల ఏ సినిమా ఎలా ఉందనేది క్షణాలలో తెలిసిపోతుంది.

బాగున్న సినిమాలను ఎవరూ కూడా థియేటర్ల నుంచి తొలగించలేరు అంటూ సిద్ధార్థ చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల కొందరు విమర్శించగా మరికొందరు ఈయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు