సప్తగిరి హీరోగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రిగ్వేద క్రియేషన్స్ సినిమా

హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు సంతకం చేశారు.ఆయన కథానాయకుడిగా యజ్ఞం, పిల్లా.

నువ్వు లేని జీవితం వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఎ.ఎస్.రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు.ఫిబ్రవరి ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Hero Sapthagiri New Movie Under The Direction Of As Ravikumar Details, Hero Sapt

నిర్మాత ఎ.ఎస్.రిగ్వేద చౌదరి మాట్లాడుతూ "వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది.సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి.

రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం.ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి" అని అన్నారు.

Advertisement

సప్తగిరి హీరోగా నటించనున్న ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, కూర్పు: గౌతం రాజు, పోరాటాలు: రామ్ - లక్ష్మణ్, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్, కళ: రమణ వంక, కో-డైరెక్టర్: మురళీధర్ రావు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సహ నిర్మాత: దేవినేని రవి, నిర్మాత: ఎ.ఎస్.రిగ్వేద చౌదరి, కథ - స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!
Advertisement

తాజా వార్తలు