ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ పాత్ర ఇస్తే నేను చేస్తా అని చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా...?

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం క్రియేటివ్ డైరెక్టర్ గా పిలుచుకునే వ్యక్తి కృష్ణ వంశీ గారు.

మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఖడ్గం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పాడు అవేంటంటే.

ఆయన చేసిన మురారి సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అయినా తర్వాత నెక్స్ట్ ఏం సినిమా చేద్దాం ని ఆలోచిస్తున్నప్పుడు దేశ భక్తి మీద ఒక సినిమా చేయాలి అనుకొని ఖడ్గం సినిమా కథ రాసుకున్నారు దాంట్లో భాగంగా ఈ సినిమా లో ఆర్టిస్ట్ ల కోసం కృష్ణ వంశీ ముందుగా చాలా మంది హీరో లని అనుకున్నాడు కానీ ఫైనల్ గా రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లతో చేసి మంచి హిట్ అందుకున్నారు.ఇది ఇలా ఉంటె ఈ సినిమా స్టోరీ మొత్తం పూర్తి అయినా తరువాత కృష్ణవంశీ ఈ కథని రవితేజ కి చెప్తే స్టోరీ మొత్తం విన్న రవితేజ నాకు బాగా నచ్చింది అని చెప్పాడట తర్వాత కృష్ణవంశీ రవితేజ తో సినిమా పిచ్చోడు గా ఉండే చంటి క్యారెక్టర్ నువ్వు చేయాలి అని చెప్పగానే రవితేజ చంటి క్యారెక్టర్ బాగుంది కానీ నాకు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలనీ ఉంది అది ఇవ్వచ్చు కదా అని అడిగితే

Hero Raviteja Asked For Srikanth Character In Khadgam Movie Details, Hero Ravite

అప్పుడు కృష్ణ వంశీ ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా నువ్వు బాగానే చేస్తావ్, కానీ నువ్వు చేయాల్సిన చంటి క్యారెక్టర్ నీలాగా ఎవ్వరు చేయలేరు అని చెప్పడంతో రవితేజ చంటి క్యారెక్టర్ చేసాడు పోలీస్ ఆఫిసర్ క్యారెక్టర్ శ్రీకాంత్ చేసాడు.అలాగే ఈ విషయాలన్నీ చెప్తూనే ఈ క్యారెక్టర్ గురించి జరిగిన ఇంకో సంఘటన కూడా చెప్పారు అది ఏంటంటే ఈ స్టోరీ తో స్టార్టింగ్ లో ఒక ప్రొడ్యూసర్ ని కలిస్తే స్టోరీ విన్న ఆ ప్రొడ్యూసర్ కి కథ బాగా నచ్చింది అని చెప్పి

Hero Raviteja Asked For Srikanth Character In Khadgam Movie Details, Hero Ravite

ఈ స్టోరీ లో ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారట అప్పుడు ఇలా శ్రీకాంత్ ని అనుకుంటున్నాను అని కృష్ణ వంశీ చెప్పగానే ఆయన వద్దు వేరే వాళ్ళని పెడుతా అంటే చెప్పు నేనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పాడట అప్పుడు కృష్ణ వంశీ కి కోపం వచ్చి నువ్వు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని అక్కడి నుంచి బయటికి వచేసాడట.ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం ఇలా చాలా మంది పోటీ పడ్డారు కానీ ఫైనల్ గా శ్రీకాంత్ ఆ క్యారెక్టర్ చేసి దానికి న్యాయం చేసాడు.

Advertisement
Hero Raviteja Asked For Srikanth Character In Khadgam Movie Details, Hero Ravite
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు