న్యూ లుక్ లో హీరో నితిన్.. వరస్ట్ సినిమాలు చేసి మామీద రుద్దకంటున్న నెటిజన్స్?

అప్పుడప్పుడు అభిమాన హీరోల విషయంలో అభిమానులు చాలా ఆందోళన పడుతూ ఉంటారు.ముఖ్యంగా వారి సినిమాల విషయంలో మాత్రం అభిమానులు చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటారు.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ అభిమానాల హీరోల విషయంలో చాలా రచ్చ చేశారు.ఆ సినిమా నచ్చకపోతే కొన్ని కొన్ని సార్లు తమ అభిమానం హీరోలపై ఫైర్ అవుతూ ఉంటారు.

నిజానికి కొందరు హీరోలు సినిమా ఎంపిక విషయంలో తొందరపడి సినిమాలు చేస్తూ తమ అభిమానులను బాగా నిరాశ పరుస్తూ ఉంటారు.దీంతో కొన్నిసార్లు అభిమానులు కూడా తమకు ఓపిక నశించడంతో తమ అభిమాన హీరో అని చూడకుండా కూడా వారిపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.

తాజాగా ఇటువంటిదే హీరో నితిన్ కు ఎదురయ్యింది.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి అందరికీ తెలిసిందే.

Advertisement

తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు.చాలా సినిమాల్లో మంచి హిట్ ను సాధించుకున్నాడు.

తాను సినిమాలలో తన పాత్రకు తగ్గట్టుగా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.నితిన్ కు సినిమా పట్ల ఆసక్తి కల్పించిన పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తొలిప్రేమ.

ఇందులో పవన్ కళ్యాణ్ నటనను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు నితిన్.

అలా తాను కూడా హీరో అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.2002లో జయం సినిమా ద్వారా తొలిసారిగా వెండితెరపై అడుగుపెట్టగ ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు అందించింది.అలా ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన నితిన్ కు ఉత్తమ నటుడిగా గుర్తింపు వచ్చింది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

నితిన్ నటించిన ప్రతి ఒక్క సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా లుక్ ను  ఎంచుకుంటాడు.ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమానం కూడా ఉంది.అయితే గత కొన్ని రోజుల నుండి నితిన్ ఖాతాలో సక్సెస్ అనేది లేకుండా పోయింది.

Advertisement

నిజానికి టాలీవుడ్ లో ఈయన ఈ మధ్య చాలా తక్కువగా కనిపిస్తున్నాడు.ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈయన ఇప్పుడు కేవలం చాలా గ్యాప్ తో ఒక్క సినిమాతోనే వస్తున్నాడు.

దీంతో ఈ విషయం పట్ల ఆయన అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు.అయితే గత ఏడాది మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా అసలు సక్సెస్ కాలేకపోయింది.

దీంతో ఆయన అభిమానులు మళ్లీ నిరాశ చెందక తప్పలేదు.దీంతో ఆయన సక్సెస్ కోసం బాగా ఎదురు చూస్తున్నాడు.అయితే తాజాగా తన ఇన్ స్టా లో తన ఫోటో షేర్ చేసుకున్నాడు.

అందులో ఆయన బ్యాక్ సైడ్ లుక్ లో కనిపించాడు.ఇక ఆ ఫోటో వైరల్ అవ్వడంతో తన అభిమానులు ఆ ఫోటోకి బాగా లైక్స్ కొడుతున్నారు.

ఇక కొంతమంది అభిమానులు ఆయన సినిమాల విషయంలో నిరాశ చెందుతున్నారు.ఓ అభిమాని మాత్రం.

మాచర్ల లాంటి వరస్ట్ సినిమాలు చేసి మా మీద రుద్దకు అన్న.నీ నుండి మంచి సినిమాలు రావాలనుకుంటున్నాము అని కోరాడు.

తాజా వార్తలు