శ్రీలీల కి అంత సీన్ లేదు..అందుకే దూరం పెట్టాం అంటూ నితిన్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల( Sreeleela ) మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

వచ్చిన రెండేళ్లకే ఆమె టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానం ని ఆక్రమించుకుంది.

అయితే క్రేజ్ ఉందని, అవకాశాలు వస్తున్నాయని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఎంత వేగంగా ఇండస్ట్రీ లో ఎదిగారో, అంతే వేగంగా క్రిందకి పడిపోగలరు.గతం లో ఎంతో మంది హీరోయిన్స్ విషయం లో ఇది జరిగింది.

అందుకు ఉదాహరణే కృతి శెట్టి.( Krithi Shetty ) ఇప్పుడు శ్రీలీల కూడా మరో కృతి శెట్టి గా మారిపోనుంది అని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే ఆమె ధమాకా చిత్రం తర్వాత రీసెంట్ గా చేసిన సినిమాలలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) చిత్రం తప్ప, మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.దీంతో శ్రీలీల పని అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Advertisement
Hero Nithin Shocking Comments On Sreeleela Details, Hero Nithin , Sreeleela, Ext

డ్యాన్స్ తప్ప ఈ అమ్మాయికి ఏమి రాదనీ, ఎక్కువ రోజులు ఇండస్ట్రీ లో కొనసాగదని అంటున్నారు.

Hero Nithin Shocking Comments On Sreeleela Details, Hero Nithin , Sreeleela, Ext

ఇకపోతే శ్రీలీల హీరోయిన్ గా నటించిన మరో సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.( Extra Ordinary Man ) నితిన్ హీరో గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 8 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు హీరో నితిన్.

( Nithin ) ఈ చిత్రం లో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతుంది అని రీసెంట్ ఇంటర్వ్యూ లో అడగగా, దానికి నితిన్ సమాధానం ఇస్తూ ఒక కమర్షియల్ సినిమాలో హీరో మరియు హీరోయిన్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఈ చిత్రం లో కూడా శ్రీలీల కి అంతే ఉంటుంది.ఆమెది గొప్ప పాత్ర అని నేను చెప్పను, నాలుగు సాంగ్స్ , నాలుగు ఫైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె కనిపిస్తుంది.

అలాంటి పాత్రకే ఆమె ఈ సినిమాకి పరిమితం, ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి అంటూ చెప్పుకొచ్చాడు నితిన్.

Hero Nithin Shocking Comments On Sreeleela Details, Hero Nithin , Sreeleela, Ext
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.నితిన్ చాలా కాలం తర్వాత తనకి తగ్గ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు, చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు ఉంది.

Advertisement

కచ్చితంగా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. మాచెర్ల నియోజకవర్గం లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నితిన్ చేస్తున్న చిత్రం ఇది.ఈ సినిమా మీద ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో లేదో చూడాలి.

తాజా వార్తలు