నానికి అర్జంట్‌ గా ఓ సూపర్‌ హిట్‌ కావాలి... సీతతో అది దక్కేనా?

నేచురల్‌ స్టార్ నాని( natural star nani ) కమర్షియల్‌ గా బిగ్ సక్సెస్ ను దక్కించుకుని చాలా కాలం అయింది.

గత చిత్రాలు టాక్ పరంగా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

రివ్యూల పరంగా కూడా పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి.కానీ కమర్షియల్‌ గా మాత్రం భారీ విజయాలను సొంతం చేసుకోవడంలో విపలం అయ్యాయి.

మొత్తానికి నాని గత చిత్రాలు బాక్సాఫీస్( box office ) వద్ద సందడి చేయలేదు.దసరా పాన్ ఇండియా రేంజ్ లో పార్టీ చేసుకునే రేంజ్ లో వసూళ్లు నమోదు చేస్తుందని అంతా భావించారు.

కానీ ఆ సినిమా వసూళ్ల పరంగా తెలుగు లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా నిలిచినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో జీరో స్థాయి లో నిలిచింది.దాంతో నాని కి ఇప్పుడు అర్జంట్ గా ఒక సక్సెస్‌ కావాలి.

Advertisement

అది కూడా కమర్షియల్‌ సక్సెస్ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో నాని నుంచి రాబోతున్న హాయ్ నాన్న సినిమా( hi nanna movie ) అభిమానుల్లో అంచనాలు, ఆసక్తిని పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.హీరోయిన్ గా ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ ( Mrinal Thakur )నటించిన విషయం తెల్సిందే.

నాని ని ఒక నాన్న పాత్ర లో ఈ సినిమా లో చూడబోతున్నాం అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చింది.మరి హీరోయిన్ పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

హీరోయిన్‌ గా మృణాల్ తెలుగు లో సీతారామం సినిమా తో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.కనుక ఈ సినిమా తో కచ్చితంగా మరో విజయాన్ని ఆమె సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన హాయ్ నాన్న సినిమా ను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి.ఇప్పుడు టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

టీజర్‌ విడుదల తర్వాత నాన్న స్థాయి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement