నయనతార విగ్నేష్ శివన్ ప్రేమకు ఆ స్టార్ హీరో కారణమా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నయనతార ( Nayanatara ) విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) జంట ఒకటి వీరిద్దరూ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ ప్రేమలో పడి అనంతరం పెళ్లి చేసుకున్నారు.

విగ్నేష్ దర్శకుడు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక వీరిద్దరూ దాదాపు ఏడు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి గత రెండు సంవత్సరాల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఇక ఈ దంపతులు సరోగసీ ద్వారా ఇద్దరూ కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.ప్రస్తుతం నయనతార విగ్నేష్ ఇద్దరు కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.అయితే నయనతార వంటి స్టార్ హీరోయిన్ డైరెక్టర్ విగ్నేష్ ప్రేమలో పడటం ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ విగ్నేష్ నయనతారతో తన ప్రేమ ఎలా మొదలైంది తామిద్దరం ఒకటి అవ్వడానికి కారణం ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు.

Advertisement

నయనతార విగ్నేష్ ఇద్దరూ ఒక్కటి అవ్వడానికి స్టార్ హీరో ధనుష్( Danush ) కారణమని తెలుస్తుంది.విగ్నేష్ దర్శకుడిగా నానుమ్ రౌడీ ధాన్ సినిమా( Naanum Rowdy Dhan movie ) కథ నయనతారకు చెప్పమని ధనుష్ సర్ నాకు సూచించారు.ఈ సినిమా కథ నయనతారకు చెప్పడంతో ఆమెకు ఈ సినిమా కథ నచ్చింది.

అప్పటివరకు ఈ సినిమాలో నటించనని చెప్పిన విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) నయనతార ఓకే చెప్పారని తెలియగానే వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నారని విగ్నేష్ తెలిపారు.ఈ సినిమా సమయంలో నయన్ కు నేను ఎక్కువ సమయం కేటాయించాను.

అయితే మాకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమలో పడిపోయామని ఒకరకంగా మా ప్రేమకు ధనుష్ కారణం అంటూ విగ్నేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు