Keerthi pandian ashok selvan : పెళ్లి పీటలెక్కుతున్న మరో సెలబ్రిటీ జంట.. ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు సినిమాలలో నటిస్తూనే ప్రేమించుకుని ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు చాలామంది ఉన్నారు.

టాలీవుడ్ నుంచి కోలీవుడ్( Kollywood ) వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధంగా పెళ్లి చేసుకుని ఒక్కటి అయ్యారు.

ఇటీవల టాలీవుడ్ లో హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల( Varun Tej Lavanya Tripathi ) ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.తాజాగా కోలీవుడ్ లో ఒక జంట ప్రేమ పెళ్ళికి రంగం సిద్ధం అయింది.

వైవిధ్యభరితమైన చిత్రాలతో యువ హీరో అశోక్ సెల్వన్ గుర్తింపు పొందాడు.రీసెంట్ గా అశోక్ సెల్వన్ పోర్ తళిల్ అనే థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టాడు.

Advertisement

అంతకు ముందు ఓ మై కడవులే చిత్రం కూడా విజయం సాధించింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వయసు 33 ఏళ్ళు.అశోక్ సెల్వన్( Ashok selvan ) త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా అశోక్ సెల్వన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా హీరోయినే కావడం విశేషం.ఆమె ఎవరో కాదు తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్.

( Keerthi pandian ) మరో విశేషం ఏంటంటే వీరిద్దరూ ప్రస్తుతం జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినీమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది.అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 13న వీరిద్దరి వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది.కీర్తి పాండియన్ తుంబా, అంబిర్కినియల్ చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

మరి ఈ పెళ్లికి సంబంధించి మరిన్ని వార్తలు సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు