సోషల్ మీడియాకు దూరమైనటువంటి సమంత తాజాగా తాను నటించిన యశోద సినిమా టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.
ఈ క్రమంలోనే తన టీజర్ కి సంబంధించిన విషయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
సమంత ప్రధాన పాత్రలో హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యశోద.లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో సమంత ఎంతో అద్భుతంగా నటించారని తెలుస్తుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో సమంతను ఒక ప్రెగ్నెంట్ లేడీగా చూపిస్తూ ఆమె ఎంతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సూచించారు.అయితే తనకు ఎంతో క్లిష్టతరమైన పరిస్థితిలో ఎదురవుతూ ఉండడం వల్ల ఆ పరిస్థితులను తాను ఎలా ఎదుర్కొందనే విషయంపై టీజర్ ఎంతో అద్భుతంగా కట్ చేసి చూపించారు.
ఇలా ఈ టీజర్ చూస్తుంటేనే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.ఇకపోతే సమంత యశోద టీజర్ పై యంగ్ హీరో అడివి శేష్ స్పందించారు.
ఈ సందర్భంగా అడవి శేష్ సమంత చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ.మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ఆకలేకపోతున్నాను సామ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో కనిపించగా వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటు సమంత ఖుషి సినిమాలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక త్వరలోనే యశోద సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy