రూ.10కే ఎనర్జీ డ్రింక్.. ప్రారంభించిన హెరిటేజ్ సంస్థ..

డైరీ రంగంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం ఎనర్జీ డ్రింక్స్ విభాగంలో ప్రవేశించింది.తక్షణ శక్తిని అందించే గ్లూకోశక్తిని పరిచయం చేసింది.

200ml ప్యాక్‌లో లభిస్తుంది.దీని ధర రూ.10.ఎనర్జీ డ్రింక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో అందుబాటులో ఉంది.ఇది జనరల్ ట్రేడ్ స్టోర్‌లు, హెరిటేజ్ పార్లర్‌లు మరియు ఎంపిక చేసిన మోడ్రన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

వైస్ ఛైర్‌పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ భువనేశ్వరి నారా స్పందించారు.ప్రతిరోజూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం సంతోషాన్ని అందజేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి హెరిటేజ్ చేసిన మరో ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు.

ప్రధానంగా పాలు మరియు పాల ఉత్పత్తులు, పునరుత్పాదక ఇంధనం మరియు పశువుల దాణా వ్యాపారంలో, హెరిటేజ్ ఫుడ్ ఉంది.తాజాగా ఈ సంస్థ తీసుకొచ్చిన గ్లూకోశక్తి పానీయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.డేటా సంస్థ స్టాటిస్టా ప్రకారం, భారతదేశంలో శక్తి పానీయాల మార్కెట్ పరిమాణం రూ.2,400 కోట్లుగా అంచనా వేయబడింది.

Advertisement

ఇది 45-50 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.హెరిటేజ్ ఫుడ్స్ క్రీమిలిషియస్ కర్డ్ని కూడా ఆవిష్కరించింది.ప్రారంభంలో ఢిల్లీ NCR లో విడుదల చేసింది.

ఈ కొత్త క్రీమిలిషియస్ పెరుగు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర అంతటా పరిచయం చేయబడింది.హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా మాట్లాడుతూ, రిచ్ హెరిటేజ్ క్రీమిలిషియస్ కర్డ్ నిజంగా ఎలాంటి భోజనానికైనా ఆరోగ్యకరమైన మరియు రుచికరంగా ఉంటుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు