Skin whitening Tip : ముఖాన్ని క్షణాల్లో తెల్లగా మరియు గ్లోయింగ్ గా మార్చే సింపుల్ చిట్కా మీకోసం!

ఏదైనా సడన్ గా ఫంక్షన్ కు లేదా మీటింగ్ కు లేదా పెళ్లికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం నిర్జీవంగా మరియు కాంతిహీనంగా ఉంటే ఎక్కడలేని నిరుత్సాహం మన చుట్టూనే ఉంటుంది.

అస‌లు కాలు తీసి బ‌య‌ట పెట్ట‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు.

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను క‌నుక పాటిస్తే ముఖాన్ని క్షణాల్లో తెల్లగా మరియు గ్లోయింగ్ గా మార్చుకోవచ్చు.మ‌రి ఇంత‌కీ ఆ చిట్కా ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బంగాళదుంపని తీసుకుని పీల్ తొలగించి వాట‌ర్ లో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను కూడా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో బంగాళ‌దుంప జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement
Here's A Simple Tip To Make Your Face White And Glowing In Seconds, Glowing Skin

ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగు వేసి స్పూన్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

Heres A Simple Tip To Make Your Face White And Glowing In Seconds, Glowing Skin

ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసి ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వేళ్ల‌తో చర్మాన్ని మెల్ల మెల్లగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మం పై పేరుకు పోయిన మురుకి, మృత కణాలు తొలగిపోతాయి.

దాంతో చర్మం క్షణాల్లో తెల్లగా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.డల్ స్కిన్ సైతం దూరం అవుతుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు