తెలుగు తెరకు కృష్ణ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

తెలుగు తెరను ఏలిన దిగ్గజ నటుల్లో ఒకడు సూపర్ స్టార్ కృష్ణ.పలు పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.

తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.వాటిలో పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు సాధించాయి.

ఒకప్పుడు కృష్ణ డేట్ల కోసం దర్శక నిర్మాతలు పడిగాపులు కాసేవారు.ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టేవారు.

అయితే కృష్ణ తన సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేశాడు.వారంతా టాప్ హీరోలుగా ఎదిగారు.

Advertisement
Here Are The Heroines Who Are Introduces By Hero Krishna, Krishna, Super Star Kr

ఇంతకీ ఆయన పరిచయం చేసిన హీరోయిన్ల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన హీరోయిన్ విజయశాంతి.

ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ.తన కిలాడి కృష్ణుడు సినిమా ద్వారా ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

అటు బాలీవుడ్ బ్యూటీగా పేరు సంపాదించిన వర్షను కూడా తనే పరిచయం చేశాడు.రక్త తర్పణం మూవీ ద్వారా వెండి తెర మీదకు తీసుకొచ్చాడు.

ఆమె బాలీవుడ్ లో మంచి నటిగా పేరు పొందింది.

Here Are The Heroines Who Are Introduces By Hero Krishna, Krishna, Super Star Kr
ద్రాక్ష పండ్ల‌లో గింజ‌లు పారేస్తున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

అటు మరో బాలీవుడ్ తార షాహిన్ ను కూడా పరిచయం చేసింది కృష్ణ కావడం విశేషం.తన సినిమా యస్ నేనంటే నేనే మూవీతో తనను తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేశాడు.అటు బెంగాలీ నటి రూపా గంగూలీని కూడా తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే.

Advertisement

నా ఇల్లే నా స్వర్గం అనే సినిమా ద్వారా ఆమెను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.మందాకినిని కూడా పరిచయం చేసిన హీరో కృష్ణ.సింహాసనం అనే సినిమా ద్వారా తనను తెలుగు తెరకు మీద దర్శనం ఇచ్చేలా చేశాడు.

మొత్తంగా ఎంతో మంది హీరోయిన్లను కృష్ణ టాలీవుడ్ కు పరిచయం చేశాడు.వారిలో చాలా మంది మంచి కెరీర్ ను పొందారు.

తాజా వార్తలు