వెండి పాత్రల‌ను చిటికెలో మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు మీకోసం!

ప్రస్తుత రోజుల్లో బంగారానికి మాత్రమే కాదు వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది.అందుకే వెండి ధరలు( Silver prices ) రోజురోజుకు పైపైకి పోతున్నాయి.

ప్రధానంగా పూజలో వెండి వస్తువులు వాడుతారు చాలామంది.అలాగే కొందరు వెండితో పట్టీలు, ఉంగరాలు, క‌డియాలు వంటి ఆభరణాలు చేయించుకుంటారు.

అయితే వెండిని వాడగా వాడక మురికి పట్టేసి న‌ల్లగా మారుతుంటాయి.ముఖ్యంగా పూజకు సంబంధించిన వెండి పాత్రలపై మరకలు పడడం, రంగు మారడం వంటివి జరుగుతుంటాయి.

అయితే అటువంటి వెండి పాత్రలను చిటికెలో తళ‌తళా మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు కొన్ని ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బంగాళదుంపలు( Potatoes ) ఉడికించిన నీటిలో వెండి పాత్రలు వేసి పది నిమిషాల పాటు నానబెట్టండి.ఆ తర్వాత వాటిని తోమితే మరకలు పోయి వెండి పాత్రలు మెరుస్తూ కనిపిస్తాయి.అర లీటర్ హాట్ వాటర్ లో నాలుగు టేబుల్‌ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు( Salt ) వేసి కలపండి.

ఈ వాటర్ లో పది నిమిషాల పాటు వెండి పాత్రలు, ఆభరణాలు వేసి ఉంచండి.ఆపై వాటిని తోముకుంటే వెండికి పూర్వ మెరుపు తిరిగి వస్తుంది.

సౌంద‌ర్య సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డే ముల్తానీ మ‌ట్టితో( Multani soil ) కూడా వెండి పాత్ర‌ల‌ను మెరిపించుకోవ‌చ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మ‌ట్టి మ‌రియు వాట‌ర్ వేసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని వెండి వస్తువులపై రాసి కొంత సేపు వ‌దిలేయండి.

ఆ త‌ర్వాత వాట‌ర్ శుభ్రంగా క‌డిగి పొడి క్లాత్ తో తుడిచారంటే వెండి వ‌స్తువులు కొత్తవి లాగా మెరుస్తాయి.ఒక గిన్నెలో ఒక‌ కప్పు వెనిగర్, రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకుని కలపండి.

పాకిస్థానీకి చుక్కలు చూపించిన ఇండియన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!
ఇక జుట్టు ఎంత పల్చగా ఉన్న నో వర్రీ.. ఈ సీరం తో దట్టంగా మార్చుకోండి!

ఇందులో వెండి వస్తువులను రెండు నుంచి మూడు నిమిషాల పాటు ముంచండి.తర్వాత నీటితో కడిగి, మృదువైన క్లాత్ తుడవండి.ఇలా చేసినా కూడా మురికిపోయి వెండి షైనీగా మార‌తాయి.

Advertisement

తాజా వార్తలు