వ్యాక్సింగ్ తర్వాత కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

దాదాపు అందరికీ ఫేస్ మరియు బాడీ పై అన్ వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది.

ఈ హెయిర్ ను తొలగించి చర్మాన్ని అందంగా, మృదువుగా మెరిపించుకునేందుకు చాలా మంది ఎంచుకునే పద్ధతి వ్యాక్సింగ్.

ఇది కొంచెం పెయిన్ తో కూడుకున్న పద్ధతి అయినప్పటికీ.దాని ఫలితాలు మెరుగ్గా ఉండటం వల్ల వ్యాక్సింగ్ వైపే అధిక శాతం మంది మొగ్గు చూపుతుంటారు.

అయితే వ్యాక్సింగ్( Waxing ) తర్వాత చర్మంపై దురద, దద్దుర్లు, మంట ఎలా రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి.వాటికి దూరంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Here Are Some Precautions You Can Take After Waxing Waxing, After Wax Precautio
Advertisement
Here Are Some Precautions You Can Take After Waxing! Waxing, After Wax Precautio

వ్యాక్సింగ్ తర్వాత 24 గంటల వరకు వేడి వేడి నీటి( Hot Water )తో స్నానం చేయడం లేదా స్విమ్మింగ్ చేయ( Swimming )డం వంటివి చేయకూడదు.వేడి నీటితో స్నానం చేస్తే పలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.ఇక స్విమ్మింగ్ చేసే నీళ్లల్లో క్లోరిన్ ఉంటుంది.

ఇది చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోయి దురద, దద్దుర్లు వంటి సమస్యలను కలగ‌జేస్తుంది.వ్యాక్సింగ్ అనంత‌రం చ‌ర్మం పొడిబార‌కుండా, ఎర్ర‌బ‌డ‌కుండా ఉండేందుకు త‌ప్ప‌నిస‌రిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

మాయిశ్చరైజర్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి మరియు చికాకును నివారించడానికి కూడా స‌హాయ‌ప‌డుతుంది.వ్యాక్సింగ్ చేసుకున్నాక వదులుగా ఉండే శుభ్రమైన దుస్తులను ధరించండి.

త‌ద్వారా మీ చ‌ర్మానికి గాలి బాగా ఆడుతుంది.రాపిడి త‌గ్గుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

స్కిన్ ఇరిటేష‌న్ కు దూరంగా ఉంటారు.అలాగే వ్యాక్సింగ్ తర్వాత రెండు రోజుల వ‌ర‌కు ఎటువంటి పెర్ఫ్యూమ్ ఉత్పత్తులను ఉపయోగించ‌కూడ‌దు.

Advertisement

ఎందుకంటే వాటిలో ఉండే ర‌సాయ‌నాలు చ‌ర్మ రంధ్రాల్లోకి చేరి ఇన్‌ఫెక్ష‌న్ల‌కు దారి తీస్తాయి.

వ్యాక్సింగ్ అయ్యాక ఎరుపు, మంట మరియు చికాకును తగ్గించడానికి చ‌ర్మంపై చల్లని కంప్రెస్‌లను వర్తించండి.లేదా ఐస్ క్యూబ్‌తో ఆ ప్రాంతాన్ని మసాజ్ చేయండి.ఇక వ్యాక్సింగ్ ప్ర‌క్రియ కంప్లీట్ చేసుకున్నాక చ‌ర్మంపై ఫ్రెష్ క‌ల‌బంద జెల్ ను అప్లై చేసుకుంటే నొప్పి, మంట నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

తాజా వార్తలు