వైరల్ వీడియో: పులిని రౌండఫ్ చేసిన గేదలు.. చివరికి..?!

ఐకమత్యమే మహాబలం( Unity is great strength ) అంటారు పెద్దలు.కలిసికట్టుగా ఉంటే ఏ పనినైనా సాధించవచ్చనేది దీని అర్థం.

ఒక్కరిగా పోరాడితే కొన్నిసార్లు సాధించలేకపోవచ్చు.కానీ అందరూ కలిసి పోరాడితే దేనినైనా సాధించుకోవచ్చు.

అందరి బలం తోడైతే ఏ పనినైనా సులువుగా చేయవచ్చు.ఇప్పుడు ఒక గేదెల మంద( Herd of buffalo ) చేసిన పని ఐకమత్యాన్ని చాటుతోంది.

ఐకమత్యంతో ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాయి.

Advertisement

పులిని( Tiger ) చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది.మనుషులే కాదు జంతువులు కూడా వాటిని చూస్తే పరిగెడతాయి.తమను వేటాడి తినేస్తాయనే భయంతో పులులను చూడగానే మిగతా జంతువులు భయపడతాయి.

అయితే అలాంటి భయంకరమైన పులులను కూడా కొన్ని జంతువులు భయపెట్టడం, వాటి దాడి నుంచి చాకచక్యంగా తప్పించుునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కొన్ని గేదెలు కలిసి పులిని చంపేశాయి.మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలుగా పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గేదెలను పులులు చంపేసి తింటూ ఉంటాయి.కానీ పులులను గేదెలు చంపేయడమే విచిత్రంగా మారింది.గేదెలన్నీ కలిసి పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా( Chandrapur ) మూల్ తాలూకా పరిసరాల్లో ఒక పులి సంచరిస్తుంది.ఈ క్రమంలో బెంబాడా గ్రామంలోని అటవీ ప్రాంతంలో గేదెలపై పులి దాడి చేసింది.

Advertisement

అయితే గేదెలు బెదరలేదు.అన్నీ కలిసి పులిపై దాడి చేసి చంపేశాయి.

తమ కొమ్ములతో పొడిచి పులిని చంపేశాయి.అక్కడ ఉన్న పశువుల కాపరి దీనిని తన ఫోన్ లో వీడియో( Viral Video ) తీశాడు.

దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.టీమ్ వర్క్ గా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

తాజా వార్తలు