మరో నాలుగైదు రోజుల్లో అందరికీ సాయం..: సీఎం జగన్

తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన బాధితులను పరామర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు.తుఫాను సమయంలో వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేసిందన్న ఆయన గ్రామ సచివాలయ వ్యవస్థతో బాధితులను ఆదుకున్నామని చెప్పారు.

బాధితులకు రేషన్ అందించామని పేర్కొన్నారు.మరో నాలుగైదు రోజుల్లో అందరికీ సాయం అందిస్తామని, వీలైనంత త్వరగా విద్యుత్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు