తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు ..!

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని ప‌లు జిల్లాలో మోస్త‌రు నుంచి భారీ వాన‌లు ప‌డే ఛాన్స్ ఉంది.

దీంతో నిర్మ‌ల్, నిజామాబాద్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, వికారాబాద్ తో పాటు సంగారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.అదేవిధంగా ఆదిలాబాద్, మ‌హ‌బూబాబాద్, మంచిర్యాల‌, కొమురం భీం ఆసిఫాబాద్, జ‌గిత్యాల‌, సిరిసిల్ల‌, వ‌రంగ‌ల్, జ‌న‌గామ జిల్లాల్లో అధికారులు ఎల్లో అలెర్ట్ చేశారు.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు