తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కుర‌వునున్నాయని ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలో నిజామాబాద్, నిర్మ‌ల్, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల జిల్లాల‌కు అధికారులు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు.మిగ‌తా జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు.

భారీ వర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Advertisement