సీఎం జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణ

ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఇందులో భాగంగా మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది.ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా ఒకే పార్టీకి చెందిన నాయకులని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు.

ఈ నేపథ్యంలో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే జనవరికి వాయిదా వేసింది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు