నేడు హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ పై విచారణ

బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

సెక్యూరిటీ తొలగింపుపై ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భద్రత తొలగించారని ప్రదీప్ రావు పిటిషన్ లో పేర్కొన్నారు.అదేవిధంగా తనకు ప్రాణహాని ఉందని, 2 + 2 భద్రత కల్పించాలని ధర్మాసనాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో ప్రదీప్ రావు పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేయనుంది.అయితే, తాను బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరినందుకే గన్ మెన్లను తొలగించారని ప్రదీప్ రావు ఆరోపించారు.

తనకు ప్రాణహాని ఉందన్న ఆయన తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement
పవన్ కళ్యాణ్ శివాజీ రాజా కు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా ?