లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా వేశారు.

ఈ క్రమంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 22వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు( CBI Special Court ) వాదనలు విననుంది.అయితే లిక్కర్ స్కాం కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాను నిర్దోషినని, అక్రమంగా కేసులో ఇరికించారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో ఆమెకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

దీంతో ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో( Tihar Jail ) ఉన్నారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు